ఆర్డినెన్స్ కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర భండారా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతన్నాయి. . పేలుడు తీవ్రతకు వచ్చిన శబ్ధం 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికుల చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశించారు