రాజ్యాంగాన్ని పక్కాగా పాటించాలి..
-డిఆర్ ఎటి కోల్కతా చైర్పర్సన్, జస్టిస్ అనీల్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ (CLIC2NEWS): స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుని.. వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని DRAT కోల్కతా చైర్పర్సన్, జస్టిస్ అనీల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. 76 గణతంత్ర వేడుకల సందర్భంగా హైదరాబాద్ DRT ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.. రాజ్యాంగాన్ని పక్కాగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జస్టిస్ అనీల్ కుమార్ శ్రీవాస్తవ ఈ సందర్బంగా తెలిపారు. రాజ్యాంగంలోని విలువల కోసం లాయర్లు కృషి చేయాలని తెలిపారు. పెండింగ్ కేసులను పరిష్కరించడంలో న్యాయవాదుల సహాయసహకారాలు ఎంతో అవసరం అని తెలిపారు. యువ లాయర్లు సీనియర్న్యాయవాదులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ శ్రీవాస్తవ తెలిపారు. అనంతరం DRT1, మరియు DRT2 ప్రిసైడింగ్ అధికారులు, గుమ్మడి గోపీచంద్, రామేశ్వర్ గంగారామ్ కోఠే, అసోసియేషన్ ప్రెసిడెంట్ జికె దేశ్పాండే, జనరల్ సెక్రటరీ డి. రాఘవులు ప్రసంగించారు…
ఈ కార్యక్రమంలో DRT అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు పతకాలను అందజేశారు. అనంతరం పలువురు సీనియర్ న్యాయవాలను DRAT కోల్కతా చైర్పర్సన్, జస్టిస్ అనీల్ కుమార్ శ్రీవాస్తవ, DRT1, మరియు DRT2 ప్రిసైడింగ్ అధికారులు, అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఘనంగా సత్కరించారు. 1 తెలంగాణ ఎన్సిసి నేవల్ యునిట్ కేడిట్స్ నిర్వహించిన పెరేడ్ పలువురిని ఆకట్టుకుంది.