వరంగల్ జిల్లాలో లారీ ఢీకొని నలుగురు మృతి

మామునూరు (CLiC2NEWS): ఇనుప రాడ్‌ల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదం వరంగల్‌లోని మామునూరులోని ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరకున్నపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇనుప స్థంభాల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి 2 ఆటోలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలను ఢీకొట్టి.. బోల్తాపడిపోయింది. ఆటోలో ఉన్న ఏడుగరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లా కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.