వివాహ వేడుకకు వెళ్ళి 9 మంది మృతి

చండీగఢ్ (CLiC2NEWS): పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాల్లో సర్దారెవాలా గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తున్న క్రమంలో జీపు అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. జీపులో ప్రయాణిస్తున్న 13 మంది కాలువలో పడిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వారిలో ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు , ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం.