సిని నిర్మాత కెపి చౌద‌రి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సినీ నిర్మాత కెపి చౌద‌రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.  చౌద‌రిని గతంలో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తుండ‌గా పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో చౌద‌రి బెయిల్‌పై ఉన్నారు. ఈ క్ర‌మంలో గోవాలో ఆయ‌న బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు  స‌మాచారం. కెపి చౌద‌రి ప‌లు తెలుగు, త‌మిళ చిత్రాల‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్నారు.  స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, అర్జున్ సుర‌వ‌రం , సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాల‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా ప‌నిచేశారు.

చౌద‌రి క‌బాలి చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.