గేమ్ ఛేంజర్: ‘నానా హైరానా..’ ఫుల్ వీడియో సాంగ్
Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం లోని ‘నానా హైరానా..’ అంటూ సాగే పాట ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ చిత్రంలోని పాటలన్నిటికి కలిపి దాదాపు 70 కోట్లు అయినట్లు సమాచారం. అటువంటి పాటల్లో ఈ ఒక్క పాట కోసం సుమారు రూ. 10 కోట్లు ఖర్చయినట్లు సమాచారం . దర్శకుడు శంకర్ తన గత చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా పాటలను ప్రత్యేకం తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.