అమెజాన్ ఫ్రైమ్ వేదికగా గేమ్ ఛేంజర్..
Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్’ త్వరలో ఒటిటిలోకి రానుంది. ఈ నెల 7 వ తేదీన మఎజాన్ ఫ్రైమ్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో కియారా అద్వాణి కథానాయిక. ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటల చిత్రీకరణ కోసం దాదాపు రూ. 70 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. శంకర్ దర్శకత్వం వహించిన గత సినిమాల్లో మాదిరిగానే ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణకు పెద్దపీట వేశారు.
ఓ ఐపిఎస్ అధికారి తన ప్రియురాలి కోసం ఐఎఎస్ గా మారడం.. రాజకీయ నాయకుడి ఎత్తుగడలను ఓ ఐఎఎస్ అధికారి ఏవిధంగా తిప్పికొట్టాడనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘గేమ్‌ఛేంజర్’ చిత్రం.