ప్రభుత్వాధికారి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు
భువనేశ్వర్ (CLiC2NEWS): ఓ ప్రభుత్వాధికారి విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. సుమారుగా రూ.1.70 కోట్లు నగదు బయటపడినట్లు సమాచాంర. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా జలవనరుల శాఖ అధికారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మల్కన్ గిరి, భువనేశ్వర్ , జయపురం, కటక్, బ్రహ్మపురంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ. 1.70 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.