నైపర్.. హైదరాబాద్లో ఫ్యాకల్టి పోస్టులు..
NIPER: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 14 ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో పంపించాలి. ది రిజిస్ట్రార్, ఎన్ఐపిఇఆర్ హైదరాబాద్ , బాలానగర్, హైదరాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంది. దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 23గా నిర్ణయించారు. రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
పోస్టుల వివరాలు
ఫార్మా స్యూటిక్స్, నేచురల్ ప్రొడక్ట్, మెడికల్ డివైజెస్ విభాగాల్లో ఖాళీలు కలవు.
ప్రొఫెసర్-4
అసోసియేట్ ప్రొఫెసర్ -5
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 5
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పిహెచ్డి తో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 40 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సి/ ఎస్ టి ఐదేళ్లు, ఒబిసి మూడేళ్లు, పిడబ్ల్యు బిడిలకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.