ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు ప్రకటన
Admissions: ఆంధ్రప్రదేశ్ లో 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఎపి ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మొత్తం 28 ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ప్రతి మోడల్ గురుకుల పాఠశాలలో 6 వ తరగతిలో 60 సీట్లు ఉంటాయి. మొత్తం స్కూళ్లలో కలపి 1640 సీట్లు . దీనిలో బాలురు-840, బాలికలు 840 సీట్లు కలవు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 19.
ప్రవేశ పరీక్ష.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఈ నెల 22న విడుదల చేయనున్నారు.
ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లల్లో 5వ తరగతి ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించకూడదు.
విద్యార్థుల వయస్సు మార్చి 31, 2025 నాటికి 10-13 ఏళ్ల లోపు ఉండాలి.
మెరిట్ జాబితాను మార్చి 15న .. ఎంపికైన విద్యార్థుల జాబితాను మార్చి 25వ తేదీన విడుదల చేస్తారు.
పూర్తి వివరాలకు https: // twreiscet. apcfss.in/ వెబ్సైట్ చూడగలరు.