4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/IND-vs-ENG.jpg)
నాగ్‌పుర్ (CLiC2NEWS): ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా 4 విక వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్‌ను టీమ్ ఇండియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే ఇపుడు తాజాగా నాగ్‌పుర్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ లో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. 249 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జైస్వాల్.. రోహిత్ లు నిరాశపరిచినా.. తర్వాత శుభ్‌మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్ కలిపి మూడో వికెట్‌కు 113 పరుగులు చేశారు. ఇద్దరూ అర్ధశతకాలతో మెరిశారు.
శుభ్‌మన్ గిల్ 87 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 52.. శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు సాధించారు.