కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా.. 8 మంది నగరవాసులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/road-accident-in-jabalpur-1.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో హైదరాబాద్‌కు చెందిన యాత్రికుల వాహనం మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 8 మంది నగరవాసులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న మినిబస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పుర్ సిహోరా సమీపంలో చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్‌తో వెళుతున్న లారీ రాంగ్ రూట్‌లో హైవే పైకి రావడంతో ఈ ఘోరం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ప్రమాద సమయంలో మినిబస్సులో 14 మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో గాయాలతో ఉన్న వారిని స్థానికుల సహాయంతో రక్షించారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరంతా హైదరాబాద్ నగరంలోని నాచారంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.