మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయ్‌

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. బుధ‌వారం రాత్రి 8.14 గంటలకు భారత్‌ గడ్డపైకి రాఫెల్‌ యుద్ధ విమానాలు చేరడంతో భారత వైమానిక దళం మరింత పటిష్ఠవంతంగా తయారైంది. తొలి బ్యాచులో ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు జూలై 29న అంబాలా ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి. వీటిని సెప్టెంబర్‌ 10న అధికారికంగా వైమానిక దళంతో చేర్చారు.   మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. మే నెలలోనే తొలివిడత విమానాలను ఇండియాకు చేరుకోవాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఆగష్టులో తొలివిడత ఐదు విమానాలు ఇండియాకు చేరుకోగా, రెండో విడతలో భాగంగా ఈరోజు మరో మూడు యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.