గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఎడిఇ ఇంట్లో ఎసిబి అధికారుల సోదాలు
అక్కమాస్తుల విలువ సుమారు రూ.100 కోట్లకు పైమాటే
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/Electricity-Department-ADE.jpg)
గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఎడిఇ సతీశ్ రెడ్డి ఇంట్లో అక్కమాస్తుల విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఎసిబి అధికారులు అంచనా వేశారు. సతీశ్ రెడ్డి రూ.50వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఎసిబి అధికారులకు చిక్కారు. దీంతో ఆయన నివాసంలో నిన్నటి నుండి సోదాలు జరుగుతున్నాయి. నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరుపగా.. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.100 కోట్లకు పైమాటే. ఆయన నివాసంలో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సతీశ్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు.