డాకు మహారాజ్: ఓటిటి స్ట్రేమింగ్ డేట్ ఫిక్స్

Daaku Maharaj: బాబి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రం జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా , బాబి డివోల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ఓటిటి లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. ఈ నెల 21 నుండి తమ ప్లాట్ ఫామ్లో డాకు మహారాజ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.