శాంసంగ్ గెలాక్సీ.. ఇపుడు కేవ‌లం రూ.10వేలకే..

Samsung Galaxy: రూ.10 వేల‌కే కొత్త ఆండ్రాయిడ్ 15తో శాంసంగ్ మొబైల్ అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌ముఖ మొబైల్ సంస్థ శాంసంగ్ దేశీయ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువ‌చ్చింది. శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్‌ల‌లో పాటు అన్ని రిటైల్ ఔట్‌లెట్ల లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. ఇది వ‌ర‌కు ఎఫ్ 06 స్మార్ట్ పోన్‌ను లాంచ్ చేసిన ఆ సంస్థ‌.. తాజాగా ఎ 06 5జి (ఎ06 5జి) ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ‌తేడాది ఇదే ఫోన్‌ను 4జి వేరియంట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా 5జి నెట్‌వ‌ర్క్ తో మార్కెట్‌లోకి తెచ్చింది. ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో ప‌రిచేస్తుంది. ఇవేకాక‌.. మ‌రో నాలుగు మేజ‌ర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు ఇస్తామ‌ని సంస్థ ప్ర‌క‌టించింది. దీని ద‌ర రూ. 10,499గా నిర్ణ‌యించింది. 4జిబి+64 జిబి వేరియంట్ ధ‌ర రూ. 10,499.. 4జిబి+ 128జిబి వేరియంట్ ధ‌ర రూ.11,499గా ఉంది. 6జిబి+128 జిబి వేరియంట్ ధ‌ర రూ. 12,999కు ల‌భించ‌నుంది. రూ.129 చెల్లించి శాంసంగ్ కేర్‌+స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే ఏడాది పాటు స్క్రీన్ రీప్లేస్ వారెంటీ ల‌భిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.