విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టిజిఎస్‌ఆర్‌టిసి శుభవార్త

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రయాణికులకు ఎప్పటికప్పుడు ఆర్‌టిసి రాయతీలు అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా తాజాగా విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్‌టిసి రాయతీలు అందించనుంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలు .. లహరి నాన్ ఎసి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరి సర్వీసుల్లో 10%% రాయితీని ప్రకటించింది. రాజధాని ఎసి సర్వీసుల్లో 8% డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు గమనించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్‌టిసి యాజమాన్యం కోరుతుంది. రిజర్వేషన్ కొరకు https://www.tgsrtcbus.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.