హరిహర వీరమల్లు నుండి రెండో పాట..

Hari Hara Veeramallu: క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కాథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఎఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నుండి విడుదలైన రెండో పాటకు చంద్రబోస్ రచనకు కీరవాణి స్వరాలు సమకూర్చారు. కొల్లగొట్టిందిరో.. అంటూ సాగే ఈ పాటను మంగిలి, రాహుల్ సింప్లిగంజ్, రమ్యా బెహరా, యామిని ఘంటశాల ఆలపించారు. ఈ పాటలో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్‌తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ కూడా కనువిందు చేయనున్నారు.