కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్

హైదరాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు టిపిసిసి క్రమశిక్షణ కమిటి వెల్లడించింది. పార్టి వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవలని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. పార్టి వ్యతిరేక చర్యలకు పాల్పడినందున.. అన్ని అంశాలు పరిశీలించాకే ఆయన్ను సస్పెండ్ చేశామని వెల్లడించారు.
కులగణన పత్రాలు తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించి.. పార్టి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో మల్లన్నకు ఈ నెల 5న క్రమశిక్షణ కమిటి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. తీన్మార్ మల్లన్న నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో పార్టి నుండి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమ శిక్షణ కమిటి ఛైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.