TGPSC: ఈ నెల 10న గ్రూప్-1 ఫలితాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో మార్చి 10వ తేదీన గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 10 నుండి 18వ తేదీ వరకు విడుదల కానున్న గ్రూప్స్ ఫలితాల వెల్లడికి సంబంధించిన షెడ్యూల్ను టిజిపిఎస్సి ప్రకటించింది. మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు వెల్లడించనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు 10న విడుదల కానున్నాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించనుంది. అదే రోజు అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల వివరాలను కూడా వెల్లడించనున్నారు.
ఈ నెల 11వ తేదీన గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా.. 14వ తేదీన గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను టిజిపిఎస్సి వెల్లడించనుంది. 17వ తేదీన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19వ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.