ఢిల్లీ మహిళలకు శుభవార్త తెలిపిన సిఎం

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలకు ముఖ్యమంత్రి శుభవార్త తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళా సమృద్ధి యోజనను త్వరలోనే అమలు చేస్తామని సిఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నిధులు సమకూర్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని అర్హులైన మహిళలకు నెలకు రూ.2500 ఆర్ధిక సాయం అందజేస్తామన్నారు. రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని సిఎం తెలిపారు.
ఢిల్లీలోని పేద మహిళలకు ఆర్దిక సాయం పథకాన్ని కేబినేట్ ఆమోదించింది. ఈ పథకం అమలు చేసేందుకు తన నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద పేర్లు నమోదు కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ `ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2500 ఆర్ధిక సాయం అందజేస్తామని బిజెపి.. రూ.2100 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టి ప్రాచారం చేశాయి.