రెండు బైక్లను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టిసి బస్సు.. ఐదుగురు మృతి
ఆదోనీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆదోనీ (CLiC2NEWS): కర్నూలు జిల్లా ఆదోనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిదింది. కార్ణాటక ఆర్టిసి బస్సు రెండు బైక్లను ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆదోని మండలం జాలిమంచి వద్ద కర్ణాటక ఆర్టిసి బస్సు అదుపుతప్పి రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. దీంతో ఓ బైక్పై ఉన్న కుప్పగళ్ గ్రామానికి చెందిన వీరన్న, ఆదిలక్ష్మి.. మరో బైక్ పై ఉన్న కర్ణాటకకు చెందిన దేవరాజు, నాగరత్న అక్కడికక్కడే మృతి చెందారు. హేమాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా హేమాద్రి ప్రాణాలు కోల్పోయాడు.