పసిడి పరుగులు.. రూ.90వేలు దాటిన బంగారం ధర..

హైదరాబాద్ (CLiC2NEWS): బంగారం ధర రోజురోజుకూ పెరుగుతుంది. హైదరాబాద్ బులియన్ విపణిలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగి రూ.90వేలు దాటింది.
అగ్రరాజ్యంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు .. బంగారంపై పెట్టుబుడులు పెరుతున్న నేపథ్యంలో ధరలు ఒక్కాసారిగా పెరుగుతున్నాయంటున్నారు. మేలిమి బంగారం ధర అంతర్జాతీయ విపణిలో 2983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.90,450కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.1.03లక్షలకు చేరింది.