టిజి పిజిఇసెట్- 2025

TG PGRCET: తెలంగాణ‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (పిజిఇసెట్)- 2025 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఎంటెక్ , ఎంఫార్మ‌సి చేయాల‌నుకునే విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాష్ట్రంలోని విశ్వ‌విద్యాల‌యాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్‌, ఫార్మ‌సి, అర్కిటెక్చ‌ర్ క‌ళాశాల‌ల్లో ఫుల్ టైం ఎంటెక్, ఎంఇ, ఎంఫార్మ‌సి, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్‌డి కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ను జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటి (జెఎన్ టియుహెచ్‌) హైద‌రాబాద్ నిర్వ‌హించ‌నుంది.

బిఇ, టిటెక్‌, బిఫార్మ‌సి ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 17వ తేదీనుండి మే 19 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 1100 గా ఉంది. (ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగుల‌కు రూ.600)

పిజిఇసెట్- 2025 ప‌రీక్ష‌ను జూన్ 16 నుండి 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. జూన్ 7 నుండి హ‌ల్ టికెట్లు డౌన్‌లోడ్ ప్రారంభ‌మవుతుంది. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (సిబిటి) జరుగుతుంది. ప‌రీక్ష వ్య‌వ‌ధి 2 గంట‌లు ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ లో నిర్వ‌హిస్తారు.

Leave A Reply

Your email address will not be published.