హైద‌రాబాద్‌లో ఎంటిఎస్ స్టాఫ్‌.. స్పోర్ట్స్ కోటాలో కొలువులు

న‌గ‌రంలోని ప్రిన్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ టాక్స్ .. తెలంగాణ ఖి ఎపి స్పోర్ట్స్ కోటాలో 56 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

స్టెనో గ్రాఫ‌ర్ – గ్రేడ్ -2 .. 2

ట్యాక్స్ అసిస్టెంట్ ..28

మ‌ల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్‌) ..26

ఈ పోస్టుల‌ను స్పోర్ట్స్ కోటాలో భ‌ర్తీ చేయుట‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 5లోపు పంపించాల్సి ఉంది.

స్పోర్ట్స్ విభాగాలు..అథ్లెటిక్స్‌, బ్యాడ్మింట‌న్, బిలియ‌ర్ట్స్ అండ్ స్నూక‌ర్స్‌, క్యార‌మ్స్‌, చెస్‌, క్రికెట్‌, హాకీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్, , బ్రిడ్జి, టెన్నిస్‌, టేబుల్ టెన్నిస్‌, క‌బ‌డ్డీ, స్క్వాష్‌, స్విమ్మింగ్, బాడీ బిల్డింగ్‌.

స్టెనో గ్రాఫ‌ర్, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ. 25,500 నుండి రూ. 81,100 వ‌ర‌కు ఉంటుంది. అభ్య‌ర్థుల వ‌య‌స్సు జ‌న‌వ‌రి 1, 2025 నాటికి 18 నుండి 27 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి.

ఎంటిఎస్ పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ. 18 వేలు నుండి రూ. 56,900 వ‌ర‌కు ఉంది. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుండి 25 ఏళ్ల లోపు ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల పూర్తి వివ‌రాల‌కు https://incometaxhyderabad.gov.in/index.php వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Leave A Reply

Your email address will not be published.