ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన..

బీజింగ్ (CLiC2NEWS): ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది చైనా. గంటసేపు సమయం పట్టే ప్రయాణం..ఈ వంతెనపై కేవలం ఒక్క నిమిషం సమయంలో పూర్తి కానుంది. ఈ వంతెన ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో చైనా నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన నిర్మాణాన్ని చైనా చేపట్టింది. గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. ఇది ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే కట్టడం. దీని నిర్మాణాన్ని 2022లో ప్రారంభించగా.. మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషమంటున్నారు.
భారీ లోయపై వంతెన నిర్మాణంతో రాకపోకలకు లోయ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పని లేకుండా కేవలం ఒక్క నిమిషంలో అవతలివైపు చేరుకోవచ్చు. లోయచుట్టూ తిరిగి రావాలంటే గంట సమయం పట్టేది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యాటక ప్రాంతంగాను ఈ వంతెన నిలవనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం 280 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2400 కోట్లు) ఖర్చు చేశారట.
ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు.. 3రెట్ల బరువుతో నిర్మించిన ఈ వంతెన వచ్చే జూన్ నెలలో ప్రారంభం కానుంది. ప్రపంచంలో 100 అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం చైనా లోనే ఉన్నట్లు సమాచారం.