రఘు కుంచె కూతురి పెళ్లిలో చిరంజీవి సందడి

ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ ఏడాది ‘పలాస 1978’ చిత్రంతో నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే రఘు కుంచె కుమార్తె రాగ పుష్యమి వివాహం అక్టోబర్ 29న ఆశిష్ వర్మతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.
ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పెళ్లి వేడుకకు హాజరు కాగా, ఆయన నూతన దంపతులకి పుష్ప గుచ్చం ఇచ్చి ఆశీర్వదించారు. తన కూతురి పెళ్ళి వేడుకకి చిరంజీవి హాజరైన విషయాన్ని రఘు కుంచె రీసెంట్గా తెలియజేశారు. తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ 9 నుండి ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించింది.