భారత్‌కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్..

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సతీసమేతంగా భారత్‌కు రానున్నారు. ఈ నెల 18 నుండి 24 వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం నుండి ప్రకటన విడుదలైంది. జెడి వాన్స్ సతీమణి ఉషావాన్స్ తో కలిసి భారత్‌ను సందర్శించనున్నట్లు సమాచారం.
అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జెడివాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భారత్‌లో వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వాన్స్ కుటుంబం ఢిల్లీ, జైపుర్, ఆగ్రాలను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో జెడి వాన్స్ భేటీ కానున్నట్లు సమాచారం. ఆయన సతీమణి ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ఎపిలోని కృష్ణా జిల్ఆ పామర్రుకి దర్గర్లో ఉన్న గ్రామంకి చెందిన వారు. వీరు 1970ల్లోనే అమెరికాకు వలస వెళ్లారు. రాధాకృష్ణ, లక్ష్మి దంపతుల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు.