ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకున్న బంగారం ధర..

ఢిల్లీ (CLiC2NEWS): పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.98వేలకు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరుతున్న తరుణంలో అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. దీంతో పాటు అమెరికా – చైనా దేశాల మధ్య వాణిజ్య పరంగా ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. మంగళవారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర కూడా రూ.97,650కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధర రూ.97,700గా ఉంది. ఇదే బాటలో వెండి ధర కూడా పెరిగి రూ.99,400కు చేరుకుంది.