రైల్వేలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ (డ్రైవర్) పోస్టులు

RRB: ఐటిఐ, డిప్లొమా, బిటెక్‌లతో రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగాలను పొందవచ్చు. రైల్వే లో 9970 అసిస్టెంట్ లోకో పైలెట్ (ఎఎల్‌పి) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తులను వచ్చే నెల 11 వ తేదీలోపు పంపించాల్సి ఉంది.
సిబిటి -1, సిబిటి -2 , కంప్యూటర్ బేస్‌డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సిబిఎటి), ధ్రువపత్రాల పరిశీలన , వైద్య పరీక్షల అనంతరం నియామకాలు చేపడతారు. ఈ పరీక్షలను తెలుగులో కూడా రాసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు నింపేటప్పుడు మనం ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నామో తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవెల్-2 మూల వేతనం రూ.19,900 అందుతుంది. దీంతో పాటు డిఎ, హెచ్ ఆర్ె, టిఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఇవి అన్నీ కలిపి మొదటి నెల నుండే రూ. 40వేల వరకు జీతం పొందవచ్చు. నూతన పే కమిషన్ అమలైతే ఇంత కంటే ఎక్కువ మొత్తంలో జీతం అందుతుంది.
టెన్త్ తర్వాత నిర్దేశిత ట్రేడులు/ బ్రాంచీల్లో ఐటిఐ / అప్రెంటిస్ షిప్/ డిప్లొమా/ బిటెక్.
జులై 1, 2025 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఒబిసిలకు మూడేళ్లు.. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.500గా ఉంది. వీరు సిబిటి -1కు హాజరైతే రూ.400 అకౌంట్‌కు బదిలీ చేస్తారు. ఎస్‌సి, ఎస్‌టి , మహిళలు , మైనారిటీలు, ఇబిసిలు, ట్రాన్స్ జెండర్లకు రూ.250గా నిర్ణయించారు. వీరు సిబిటి-1 కు హాజరైతే బ్యాంకు ఛార్జీలు పోను మిగతాది అకౌంట్‌కు జమ చేస్తారు.
పరీక్ష తేదీలు, పరీక్ష సిలబస్ తదితర పూర్తి సమాచారం. కొరకు www.rrbapply.gov.in/#/auth/landing వెబ్‌సైట్ చూడగలరు.