AP: ఈ నెల 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు వెల్లడించారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూలం ఇంటర్ ఫలితాలు కూడా విడుదల కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.
అంతే కాకుండా మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లోని వాట్సప్‌లో 9552300009 నంబర్‌కు అని మెసేజ్ పంపాలి. అనంతరం విద్యా సేవలను ఎంచుకొని , — పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకొని , రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాల పిడిఎఫ్ కాపీ పొందవచ్చు. అదేవిధంగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. —- మొబైల్ యాప్ ద్వారా కూడా ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ ద్వారా ఫలితాలు పొందే అవకాశం కల్పించినట్లు సమాచారం.