‘వసంత కోకిల’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రానా

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న ట్రైలింగ్వల్ మూవీ వసంత కోకిల. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా నర్తనశాల ఫేమ్ కాశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. మూడు భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. నవంబర్ 6న బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. విశేషం ఏమిటంటే మూడు భాషలలోని స్టార్ హీరోలు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడం. తెలుగులో రానా దగ్గుబాటి ఈ సినిమా టైటిల్ ‘వసంత కోకిల’ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. అలాగే తమిళ్‌లో స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా ఈ సినిమాకి సంబంధించిన తమిళ, కన్నడ టైటిల్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లని ఆన్ లైన్‌లో రిలీజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌గా ఈ సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు.
Happy to reveal #Simha‘s Next has been titled as #VasanthaKokila 🔥🔥🔥🔥#HappyBirthdaySimha#VasanthaMullai @actorsimha @kashmira_9 pic.twitter.com/UhPUQA3FpQ
— Rana Daggubati (@RanaDaggubati) November 5, 2020