Pahalgam terror attack: ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల?

న్యూఢిల్లీ (CLiC2NEWS): పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వారిలో ముగ్గురు ఉగ్రమూకల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. గుర్తించిన వారిలో ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరికి మూసా, యూనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్ లు కూడా ఉన్నట్లు పిటిఐ పేర్కొంది. పహల్గాం ప్రత్యక్ష సాక్షులు చెప్పన వివరాల మేరకు దర్యాప్తు సంస్థలు ఈ ఊహా చిత్రాలను తయారు చేశారు. అలాగే ఒక ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న పొటోను కూడా విడుదల చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట తీవ్రమైంది.
మంగళవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పహల్గాం దాడి మొదలైంది. ఈ దాడగిని ఉగ్రవాదులు బాడీ కెమెరాలతో చిత్రీకరించినట్లు దర్యాప్తులో తెలింది.