భారీ రోడ్డు ప్రమాదం.. వ్యాన్ బావిలోకి దూసుకెళ్లి 11 మంది మృతి

భోపాల్ (CLiC2NEWS): 13 మంది ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్ .. బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్ జిల్లాలోని నారాయణ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నకచారియా గ్రామంలో చోటుచేసుకుంది. వ్యాన్‌లో ఉన్నవారిలో తొమ్మిది మందితో పాటు బైక్‌ను నడిపే వ్యక్తి కూడా మృత్యువాత పడ్డాడు. గాయాలతో బయటపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.