టిటిడి: సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు..

తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానంలో మే 1వ తేదీ నుండి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. మే 1 నుండి జులై 15 వరకు పిఫార్సు లేఖలు చెల్లవని తెలిపారు. వేసవి సెలవులు నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రొటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపింది. మే 1 నుండి పరిశీలనాత్మకంగా విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్లు టిటిడి వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రొటో కాల్ విఐపిలకు ఉదయం 6 గంటల నుండి బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ నిర్ణయం కూడా వచ్చే నెల 1వ తేదీ నుండి జులై 15 వరకు అమలులో ఉండనున్నట్లు సమాచారం.