రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ

ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ.. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ ప్రయాణంలో ఆయన పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక అగ్ర నటుడిగా గుర్తింపు పొందారు. క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతో మంది జీవితాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది.