నిర్మాణ భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి

తిరుపతి (CLiC2NEWS): తిరుపతి నగర సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం మీద నుండి ప్రమాదవశాత్తూ ముగ్గురు కార్మికులు పడిపోయారు. వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణంలో ఉపయోగించిన మేరవ కర్రలు ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. తుడా క్వార్టర్స్‌లోని హెచ్ ఐజి విభాగంలో ప్లాట్ నంబర్ 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య ఐదంతస్తుల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులలో ముగ్గురు ఐదో అంతస్తు నుండి కిందపడి దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారు బొటోతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె. శ్రీనివాసులుగా గుర్తించారు. వారితో పనిచేసే మాదవ మాత్రం ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.