రూ. 2 వేలు పైనే తగ్గిన పుత్తడి

హైదరాబాద్ (CLiC2NEWS): పసిడి ప్రియులకు శుభవార్త. ఆల్‌టై మ్ గరిష్టానికి చేరిన బంగారం కాస్త దిగొచ్చినట్లు కనపడుతోంది. గురువారం పదిగ్రాముల బంగారం ధర రూ. 2 వేలు పైనే తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 2,180 తగ్గి రూ. 95,730 పలుకుతోంది. వారం పదిరోజుల్లో పసిడి దర దాదాపు రూ. 5 వేలు వరకు తగ్గాయి. కాగా అంతర్జాతీయంగా డాలర్ విలువ కాస్త బలపడుతుండటం, అమెరిక, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త మెరుగుపడటం తదితర అంతర్జాతీయ కారణాలు కూడా బంగారం ధరలు దిగిరావడానికి కారణాలుగా విశ్లేషకులు తెలుపుతున్నారు.