గోవాలోని ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురి మృతి

పనాజి (CLiC2NEWS): గోవాలోని శిర్గావ్‌లో గల లైరాయ్ ఆలయంలో ఆపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడినట్లు సమాచారం. శ్రీ లైరాయ్ ఆలయంలో జాతర సందర్భంగా గోవా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో నిప్పులపై నడిచే ఆచారం అనాదిగా కొనసాగుతుంది. దీనికోసం శనివారం తెల్లవారుజామున వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఒక్కసారిగా రద్దీ ఎక్కువై తొపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తొక్కిసలాట ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ పరామర్శించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.