భారత్కు అండగా ఉంటాం.. ప్రధాని మోడీకి ఖతార్ నేత ఫోన్..

ఢిల్లీ (CLiC2NEWS): ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్థానీ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి.. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్కు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఖతార్ పాలకుడు మంగళవారం మోడీకి ఫోన్ చేశారు. భారత్కు అండగా ఉంటామని ప్రకటించినందుకు ఆయనకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఏడాదిలో తమీమ్ బిన్ హమద్ భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. భారత్-ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బోలపేతం చేసుకునేందుకు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాల నేతలు ప్రకటించినట్లు సమాచారం.