టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్‌శర్మ..

Rohit Sharma: టెస్ట్ క్రికెట్‌కు హిట్‌మ్యాన్ గుడ్ బై చెప్పాడు. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2013లో టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. 67 మ్యాచ్‌లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు.
రోహిత్ శర్మ భారత్ తరపున వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమ్ ఇండియా రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరింది.