చందానగర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ (CLiC2NEWS): చందానగర్‌లో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేగంగా మంటలు వ్యాపించడంతో షాపింగ్ మాల్ మొత్తం మంటలు అలుముకోవడంతోపాటు పక్కన ఉన్న షాపులకు సైతం వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే షాపింగ్ మాల్‌లో ఏడాది క్రితం కూడా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.