భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఢిల్లీ (CLiC2NEWS): భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న లేదా చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం చేసేందుకు , సమాచారం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా కంట్రోల్ రూమ్ నంబర్ 011-23380556 ను సంప్రందించాలని సూచించారు. దీంతో పాటు రెసిడెంట్ కమిషనర్ ప్రైవేటు సెక్రటరీ , లైజన్ హెడ్ నంబర్ 9871999044, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడి నంబర్ 9971387500, తెలంగాణ భవన్‌లో లైజన్ ఆఫీసర్ నంబర్ 9643723157 , పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నంబర్ 9949351270 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో తెలిపారు.