పోలీసు విచారణకు హాజరైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్..

హైదరాబాద్ (CLiC2NEWS): హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం పోలీసు విచారణకు శ్రీనివాస్ హాజరయ్యారు. జుబ్లిహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటికి వెళుతున్న సమయంలో రాంగ్‌రూట్‌లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని ఆపిన ట్రాఫిక్ పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ కారును సీజ్ చేసి, నోటీసులు ఇచ్చారు. అవసరం ఉన్నపుడు కోర్టు విచారణకు హాజరు కావాలని సూచించారు.