దేశవ్యాప్తంగా అన్ని మ్యూజియంలలో ఉచిత ప్రవేశం..!

ఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా ఆదివారం చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 52 మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ చరిత్రపై అవగాహన, చరిత్ర గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్యేశంతో ఈ రోజు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. అదేవిధంగా 3,698 చారిత్రక ప్రదేశాల్లోనూ ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు సమాచారం.
తాజ్‌మహాల్, ఎర్రకోటతో సహా మన తెలంగాణలోని చార్మినార్, గోల్కొండ వంటి ప్రదేశాలను కూదా ఈరోజు ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల వారణాసిలో ప్రారంభించిన మాన్ మహాన్ అబ్జర్వేటరీలోని వర్చువల్ ఎక్స్ పీరియన్షియల్ మ్యూజియంలోకి కూడా నేడు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.