అన్న‌మ‌య్య జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

పీలేరు (CLiC2NEWS): అన్న‌మ‌య్య పీలేరు మండ‌లం బాల‌మువారిప‌ల్లి వ‌ద్ద ఆదివారం వేకువ జామున రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద‌వశాత్తూ కారు బావిలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారు క‌ర్ణాట‌క రాష్ట్రం చింతామ‌ణికి చెందిన శివ‌న్న‌, లోకేశ్‌, గంగుల‌య్య‌గా గుర్తించారు. వీరంతా సునీల్‌, తిప్పారెడ్డితో క‌లిసి పీలేరు లో జ‌రుగుతున్న క్యాట‌రింగ్ ప‌నుల‌కు బ‌య‌లుదేరారు. ఆదివారం తెల్ల‌వారుజామున పీలేరు మండ‌లం బాల‌మువారిప‌ల్లె వ్య‌వ‌సాయ పొలాల స‌మీపంలో వీరు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి బావిలోకీ దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదం నుండి సునీల్ , తిప్పారెడ్డి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.