ఘోర అగ్నిప్రమాదం.. యజమాని సహా ఎనిమిది మంది మృతి

సోలాపూర్ (CLiC2NEWS): మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టెక్స్‌టైల్స్ మిల్లులో మంటలు చెలరేగి యజమాని సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్ హౌస్ వద్ద అగ్నిప్రమాదం జరిగి 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఇదే రోజు మహారాష్ట్రలో మరో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
సోలీపూర్ ఎంఐడిసిలోని అక్కల్‌కోట్ రోడ్డులో ఉన్న సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్స్‌లో ఆదివారం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చుననే ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మిల్లు యజమానితో పాటు ఆయన ఒకటిన్నరేళ్ల మనవడు సహా ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు, నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు.