హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): రాజధాని శివారు హయత్ నగర్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిసిఎం వ్యాన్, కారు ఢీ కొన్నాయి. కంట్లూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. దాంతో కారులోని ప్రయాణికులు ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కంట్లూరు కు చెందిన పిన్నింటి చంద్రసేనా రెడ్డి (24), చుంచు త్రినాథ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23) గా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.