42 పరుగుల తేడాతో ఆర్సిబిపై హైదరాబాద్ విజయం..

IPL: సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సిబికి మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్లో 42 పరుగుల తేడాతో సన్రైజర్స్ జట్టు విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 231 పరగులు చేసింది. అనంతరం 232 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆర్సిబి 189 పరుగులకు ఆలౌటయ్యింది.