కొచ్చి స‌ముద్ర‌ తీరంలో మునిగిన నౌక‌.. కంటైన‌ర్ల‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు

తిరువ‌నంత‌పురం (CLiC2NEWS): కేర‌ళ స‌ముద్రం తీరంలో లైబీరియాకు చెందిన భారీ నౌక స‌ముద్రంలో పూర్తిగా మునిగి పోయింది. దానిలో ఉన్న కంటైన‌ర్లు స‌ముద్ర‌జ‌లాల్లో ప‌డిపోయాయి. వాటిలోని కొన్ని కంటైన‌ర్లో ప్ర‌మాద‌క‌రమైన ర‌సాయ‌నాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తం 640 కంటైన‌ర్లలో 12 కంటైన‌ర్ల‌తో కాల్షియం కార్బైడ్‌, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ ట‌న్నుల డీజిల్‌, 367.1 మెట్రిక్ ట‌న్నుల ఫ‌ర్నేస్ అయిల్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇవి లీకైతే స‌ముద్ర జ‌లాలు తీవ్రంగా క‌లుషిత‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని కొచ్చి తీరంలో హైల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

కేర‌ళ స‌ముద్ర తీరానికి 38 నాటిక‌ల్ మైళ్ల దూరంలో లైబీరియాకు చెందిన నౌక శ‌నివారం స‌ముద్రంలో ప్ర‌మాదానికి గురైంది. ఈ నౌక‌లో 640 కంటెయిన‌ర్లు ఉన్నాయి. నౌక స‌ముద్రంలోకి ఒరిగిపోవ‌డంతో కంటైన‌ర్లు స‌ముద్ర జ‌లాల్లో ప‌డిపోయాయి. కంటెయిన‌ర్ల‌ను, అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇంధ‌నం తీరంపైపున‌కు వ‌స్తే.. వాటిని ప్ర‌జ‌లెవ‌రూ తాకొద్ద‌ని కేర‌ళ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రించింది. 184 మీట‌ర్ల పొడ‌వున్న ఎంఎస్‌సి ఎల్సా 3 నౌక కొచ్చిన్ చేరుకోవాల్సి ఉండ‌గా.. స‌ముద్ర జ‌లాల్లో ఒరిగిపోయింది. తీర ర‌క్ష‌క ద‌ళం స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించి నౌక‌లో 24 మంది సిబ్బందిని ర‌క్షించారు.

Leave A Reply

Your email address will not be published.